మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళలకు సత్వరం డ్రైవింగ్ లైసెన్సుల జారీకి కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రోజున జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా కార్యాలయాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించనున్నారు. అభ్యర్థులు పాస్ పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రం లేదా మీ సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి రవాణాశాఖ వెబ్ సైట్ లోఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ మీరా ప్రసాద్ కోరారు.
మహిళలకు ఎల్ఎల్ఆర్ మేళా - అంతర్జాతీయ మహిళ దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న మహిళలకు కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించనున్నారు.
aprtacitizen.epragathi.org సైట్లో ఎల్ఎల్ఆర్ మేళా ఆప్షన్ క్లిక్ చేసి టోకెన్ నెంబర్ చోట 523242 నెంబర్ ను నమోదు చేయాలని కోరారు. నిర్దేశిత రుసుమును ఏటీఎమ్ కార్డు ద్వారా ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వారు మార్చి 8నే సమీప ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో స్క్రీన్ టెస్ట్ కు హాజరు కావాలని కోరారు. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేటల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 ఏళ్ల వయసు దాటిన మహిళా అభ్యర్థులు ఫారం-1ఏ లో మెడికల్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరయ్యేఅభ్యర్థులు ముందుగా www.aptransport.org వెబ్ సైట్ లోఇచ్చిన మాక్ టెస్టును చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు.