రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం విహాయాత్రలు చేస్తున్నారని మహిళా సంఘాల నేతలు విమర్శించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో బాధితులతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
WOMENS PROTEST: 'మహిళలకు భద్రత కల్పించడంలో సీఎం జగన్ విఫలం'
మహిళలకు భద్రత కల్పించటంలో సీఎం జగన్ విఫలమయ్యారని మహిళ సంఘాల నేతలు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం విహారయాత్రలకు వెళుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బాధితులతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో అత్యాచార నిరోధక పోరాట వేధిక ఆధ్వర్యంలో బాధిత మహిళలతో నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా సంఘాలు, పౌరసంఘాలు నిరాహార దీక్షలో పాల్గొన్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై రోజుకో హత్య.. పూటకో అత్యాచారం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమల్లోలేని దిశా చట్టం గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారన్నారు.
ఇదీ చదవండి