విజయవాడలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం విజయవాడలో విముక్తి సంస్థ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లాల్లో వ్యభిచార గృహాల నుంచి విముక్తి పొందిన మహిళలు, అక్రమ రవాణా చెర నుండి తప్పించుకుని బయటపడిన బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ అక్రమ రవాణాపై చేసిన చట్టాలు, నిబంధనలను తూ.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని బాధితులు డిమాండ్ చేశారు.
వాళ్లకి రెండు వారాల్లోనే బెయిల్..!
అక్రమ రవాణాకు పాల్పడిన వారంతా రెండు వారాల్లోనే బెయిల్ పొంది హాయిగా బతుకుతుంటే.. తాము పునరావాస కేంద్రాల్లో ఏళ్ల బరబడి మగ్గిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి పూర్తిగా కఠినతరం చేస్తూ 'యుఎన్ఏఐ' బిల్లు సవరించాలని డిమాండ్ చేశారు.
భద్రత కావాలి..
విముక్తి పొందిన మహిళలకు వారి సొంత ఊరిలోనే జీవించడానికి ఆర్థిక, సామాజిక రక్షణ భద్రతలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు పునరావాసం, పునరుద్ధరణ ఆశ్రమాలను ప్రభుత్వం ద్యారా మాత్రమే కల్పించాలని ఈ సమావేశంలో బాధితులు తీర్మానించారు.
కఠినంగా శిక్షించాలి..
వ్యభిచారానికి కారణమవుతున్న ట్రాఫికర్లను పోస్కో చట్టం ద్వారా కఠినంగా శిక్షించడానికి...న్యాయస్థానాలు దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది చూడండి: కేంద్రానికి టెలికాం సంస్థల బకాయిలు రూ.92వేల కోట్లు