ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - గన్నవరంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి వార్తలు

కృష్ణా జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందినట్లు అందరు భావించారు. అనుమానాస్పద మృతి కింద సదరు మహిళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

women suspicious death in gannavaram at krishna district
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

By

Published : Dec 19, 2020, 8:47 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్​కు చెందిన దోమవరపు శ్రీనివాసరావు భార్య కొన్నిరోజుల క్రితం మృతి చెందింది. కామెర్లు ముదిరి తీవ్రమైన అనారోగ్యంతో మృతి చెందినట్లు అందరూ భావించారు. అనుమానాస్పద మృతి కింద సదరు మహిళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా.. స్థానిక తహశీల్దార్ నరసింహారావు ఆధ్వర్యంలో వైద్య నిపుణులు, పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details