ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసరా పథకం కింద లబ్ధి చేకూర్చాలంటూ మహిళల ఆందోళన - పెనుగంచిప్రోలులో మహిళల ధర్నా

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో మహిళలు ఆందోళన చేపట్టారు. ఆసరా పథకం కింద లబ్ధి చేకూర్చాలంటూ దాదాపు 90 మంది ధర్నా చేశారు.

women protest in penuganchiprolu krishna district
మహిళల ఆందోళన

By

Published : Aug 26, 2020, 5:29 PM IST

ఆసరా పథకం కింద తమకు లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిషత్ పరిషత్ కార్యాలయం మందు మహిళలు ధర్నా చేశారు. గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, సుబ్బాయిఎక్కడగూడెం గ్రామాలకు చెందిన 90 మంది ఆందోళన చేపట్టారు. పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీఎం సూచించినా.. గ్రామస్థాయిలో నాయకులు అలా చేయడం లేదని మహిళలు ఆరోపించారు.

తమ పేర్లను వాలంటీర్లు కనీస పరిశీలనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలు మారి ఇళ్లపై జెండాలు కడితేనే లబ్ధి చేకూరుస్తామని నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వీరికి తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details