విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని స్థానిక మహిళలు సొంతింటి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త దేవినేని అవినాష్ పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ఇతర ఆటవిడుపు క్రీడలు నిర్వహించారు. ఈ నెల 25 తేదీన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల పంపిణీ కార్యక్రమం చరిత్రలో మిగిలిపోతుందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మహిళలు వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.