ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ సంబంధం.. ఆవేశంలో అరాచకం! - vjayawada

వివాహేతర సంబంధం.. అభం శుభం తెలియని ఓ దివ్యాంగురాలిని బలితీసుకుంది. విజయవాడ సనత్​నగర్​లో జరిగిన ఈ దారుణం.. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అక్రమ సంబంధం.. ఆవేశంలో అరాచకం!

By

Published : Jun 19, 2019, 2:52 PM IST

Updated : Jun 19, 2019, 11:54 PM IST

విజయవాడ సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఘటనపై.. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఖలీల్​కు.. ఆయన సోదరుడి భార్య ముంతాజ్​తో వివాహేతర సంబంధం ఉండేది. కొంత కాలంగా ముంతాజ్​కు దూరంగా ఉంటున్న ఖలీల్.. 3 నెలల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని ముంతాజ్... ఖలీల్​ను, ఆయన భార్యను చంపేందుకు పథకం రచించింది. ఉదయం పెట్రోల్ సీసాతో ఖలీల్ ఇంటికి వెళ్లి ఆయనపై పెట్రోల్ పోసింది. ఆ పక్కనే ఖలీల్ సోదరి నిద్రించి ఉంది. వికలాంగురాలైన ఆమెను సరిగా పోల్చుకోలేని నిందితురాలు.. ఖలీల్ భార్యగా భావించింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది. బాధితురాలు అక్కడికక్కడే చనిపోయింది. మరోవైపు.. 80 శాతం గాయాలతో ఆస్పత్రి పాలైన ఖలీల్ మరణించాడు. వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ సంబంధం.. ఆవేశంలో అరాచకం!
Last Updated : Jun 19, 2019, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details