కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో ఓ భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై తెల్లవారుజామున స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగేశ్వరావు కుటుంబం కొంత కాలంగా ఆ ఇంట్లో అద్దెకుంటున్నారు. భవనం బాగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. నాగేశ్వరరావు, అతని భార్య లక్ష్మి, తన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు వారిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పైకప్పు పెచ్చులూడి ఇంజనీర్ భార్య మృతి... ముగ్గురికి గాయాలు - women died asbuilding slop has fallen on her in gudivada
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. నీటిపారుదల శాఖ ఏఈ నాగేశ్వరరావు కుటుంబం గుడివాడలోని బైపాస్ రోడ్డులో నివాసముంటుంది. వారు నిద్రిస్తున్న గదిలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులూడి మీద పడ్డాయి. నాగేశ్వరరావు కుటుంబసభ్యులు గాయాలపాలయ్యారు. ఏఈ భార్య లక్ష్మీ చికిత్స పొందుతూ మృతి చెందింది.
భవనం పెచ్చులూడి మహిళ మృతి
Last Updated : Jun 25, 2020, 4:39 PM IST