ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపదలో ఆదుకున్న మహిళా హెడ్ కానిస్టేబుల్​కు డీజీపీ అభినందనలు

ఆపదలో ఉన్న గర్భిణికి రక్తదానం చేసిన మహిళా హెడ్ కానిస్టేబుల్​ స్వాతిని.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ప్రతిఒక్కరు ఇలాంటి సేవాగుణం కలిగి ఉండాలని ఆయన సూచించారు.

women head constable was appreciated by dgp sawang for helping pregnant lady in krishna district
ఆపదలో ఆదుకున్న మహిళా హెడ్ కానిస్టేబుల్​కు డీజీపీ అభినందనలు

By

Published : Jun 30, 2020, 3:15 PM IST

ఆపదలో ఉన్న గర్భిణికి... కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ మహిళ పోలీస్ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న నాగ సరస్వతి(స్వాతీ) రక్తదానం చేసి ఆదుకున్నారు.

అవనిగడ్డకు చెందిన వెంకటలక్ష్మి అనే గర్భిణికి బి-పాజిటివ్ రక్తం అవసరం కాగా... సామాజిక మాధ్యమాల్లో చూసి హెడ్​ కానిస్టేబుల్​ నాగ సరస్వతి స్పందించింది. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్​... స్వాతీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అభినందించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్వాతిని సన్మానించి, రివార్డును అందజేశారు.

ఇదీ చదవండి:రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్

ABOUT THE AUTHOR

...view details