కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా వారిని కంటైనర్ బలంగా ఢీకొట్టింది. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్.. మహిళ మృతి - Woman killed in road accident
విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్