ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాళీ అయిన ఆక్సిజన్​.. ఊపిరి కోసం పోరాడుతూ మహిళ మృతి - krishna district news

కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్​ నిల్వలు ఖాళీ అవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిల్వలు అయిపోయి నాలుగు రోజులు గడవడంతో.. ఆక్సిజన్​ అందుబాటుతో లేక బాధితురాలు మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది.

corona death
ఊపిరి కోసం పోరాడుతూ మహిళ మృతి

By

Published : Apr 22, 2021, 12:14 AM IST


కృష్ణాజిల్లా అవనిగడ్డ ఏరియా హాస్పిటల్ లో కనీసం ఆక్సిజన్ సదుపాయం లేక శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించడంతో అవనిగడ్డ ఆరో వార్డుకు చెందిన 65 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. 4 రోజుల క్రితం ఆక్సిజన్ నిల్వలు ఖాళీ కాగా... అప్పటినుంచి ఆసుత్రిలో ప్రాణవాయువు కొరత ఏర్పడింది. మృతురాలిని అవనిగడ్డ ఆసుపత్రి నుంచి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా.. వాహనం అందుబాటులో లేకపోవడం కూడా మరణానికి మరో కారణంగా తెలుస్తోంది.

అధికారులు, ప్రజా ప్రతినిధుల స్పందన..

ఆక్సిజన్ లేక మరణం నమోదుకావడంపై స్పందించిన అవనిగడ్డ నియోజకవర్గం శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు సొంత ఖర్చుతో 10 ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో కోవిడ్ నోడల్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ కృష్ణాజిల్లా కలెక్టర్​కు ఆక్సిజన్ ఏర్పాటు కోసం లేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details