కృష్ణా జిల్లా మైలవరంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మారేపల్లి మాధవి అనే మహిళ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందింది. మాధవి మృతికి భర్త, అత్త మామలు కారణమని... బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. భర్త భరత్, అత్త పుష్పమ్మ మైలవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోగా... మామ దేవానందం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫ్యాన్‌కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య - మైలవరంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కృష్ణా జిల్లా మైలవరంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ మృతికి తన భర్త, అత్తమామలే కారణమని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.
కుటుంబ కలహాలతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య