ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని స్థానికుల ఆందోళన

జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళలు ఆందోళన చేసిన ఘటన కృష్ణాజిల్లా నందిగామలో జరిగింది. రహదారి పక్కనే ఏర్పాటు చేయటం వల్ల మందుబాబులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

women  agitation
మద్యం దుకాణం వద్దని ఆందోళన

By

Published : Dec 7, 2020, 10:51 PM IST

కృష్ణాజిల్లా నందిగామ శివారులోని అనాసాగరంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. దుకాణానికి తాళాలు వేసి మద్యం విక్రయాలను అడ్డుకున్నారు. రహదారి పక్కనే ఏర్పాటు చేయటం వల్ల మందుబాబులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నామని వాపోయారు. మద్యం దుకాణాన్ని తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details