ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో కొడాలి నానిపై ఫిర్యాదు చేసిన మహిళ..! - పోలీసుల అదుపులో కొడాలిపై ఫిర్యాదు చేసిన మహిళ

మంత్రి కొడాలి నాని తెదేపా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

tdp protest at kanchikacharla
పోలీసుల అదుపులో కొడాలిపై ఫిర్యాదు చేసిన మహిళ

By

Published : Dec 3, 2019, 5:09 PM IST

పోలీసుల అదుపులో కొడాలి నానిపై ఫిర్యాదు చేసిన మహిళ..!

తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​​పై మంగళగిరిలో మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన యలమంచిలి పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పద్మజను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కి తరలించారు. ఆమెకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల పోలీస్ స్టేషన్​కు కార్యకర్తలతో సహా చేరుకున్నారు. కొడాలి నానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సామాన్య మహిళను ఇలా స్టేషన్​కు తరలించడం సమంజసం కాదని సౌమ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్​, కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details