పెళ్లైన 12 రోజులకే.. రాజేశ్వరి అనే వివాహిత స్నానాలగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగింది ఈ ఘటన. ఇష్టం లేని వివాహం కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాజేశ్వరి స్వగ్రామం మైలవరం మండలం గణపవరం. ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతుండగా.. లాక్డౌన్లో ఆమె తల్లితండ్రులు చదువు మాన్పించి, వివాహం చేశారు. అనుకోని ఈ ఘటనతో.. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
పెళ్లైన 12 రోజులకే వివాహిత ఆత్మహత్య - మల్లవల్లిలో ఉరివేసుకుని మృతి చెందిన వివాహిత
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో.. రాజేశ్వరి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన 12 రోజులకే ఈ ఘటన జరగ్గా.. ఇష్టం లేని పెళ్లే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య