ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలి' - woman protest in krishna district

కృష్ణా జిల్లా గుడివాడలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని కోరారు. తక్షణమే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

woman protest to cancel cell tower construction in gudivada krishna district
గుడివాడలో మహిళల ఆందోళన

By

Published : Feb 24, 2021, 5:25 PM IST

ప్రజలు నివసించే ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ... కృష్ణాజిల్లా గుడివాడలో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని ఏడో వార్డు కొత్తపేటలో నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణ పనులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. టవర్ నిర్మిస్తే తాము.. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్ని విధాలా చేటు చేస్తున్న ఈ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details