కృష్ణా జిల్లా జి.కొండూరు కుంటముక్కలలో ఓ గర్భిణీ తోటలోనే ప్రసవించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన సునీత మామిడి తోటలో పని చేస్తోంది. పని చేస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో తోటలోనే శిశువుకి జన్మనిచ్చింది. 108కి సమాచారమివ్వగా.. ప్రసవమైన అరగంటకు చేరుకుని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. కుంటముక్కలకి చెందిన ఏఎన్ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిండు గర్భిణీ ప్రాణపాయ స్థితికి కారణమైందని బంధువులు ఆరోపిస్తున్నారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..తోటలోనే ప్రసవించిన మహిళ - undefined
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇంకా పలుచోట్ల గర్భిణీలు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వల్ల నిండు గర్భిణీ అనేక అవస్థలు పడింది. చివరకు తోటలోనే ప్రసవించింది.
తోటలోనే ప్రసవించిన మహిళ