గుంటూరు జిల్లా తెనాలి నుంచి మచిలీపట్నంకు వచ్చిన ఓ మహిళను మచిలీపట్నంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కాగా ఈ నెల ఒకటో తేదీన ఆమె తప్పించుకుని వెళ్లిపోయిందని క్వారంటైన్ సిబ్బంది స్థానిక సీఐ వెంకటనారాయణకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని... అనుమానంతోనే క్వారంటైన్లో ఉంచామని వైద్యులు తెలిపారు. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని... ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నామని పోలిసులు పేర్కొన్నారు.
క్వారంటైన్ కేంద్రం నుంచి మహిళ అదృశ్యం - కృష్ణా జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
క్వారంటైన్ కేంద్రం నుంచి ఓ మహిళ అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లా చిలకలపూడిలో జరిగింది. ఈ ఘటనతో పోలీసులు, అధికారులు అప్రమత్తమై పారిపోయిన మహిళ కోసం వెతుకుతున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న మచిలీపట్నం సీఐ