కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న లంకే శేషారత్నం (50) అనే మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోయింది.
అక్కడే ఉన్న ఆర్ఐ శివరామకృష్ణ అందరిని అప్రమత్తం చేసి 108కి సమాచారం ఇచ్చారు. రోడ్లపై వరదనీరు ఉండటంతో అంబులెన్స్ రాలేదు. ట్రాక్టర్లో ఆమెను గుంటూరు జిల్లా వెల్గటూరు పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.