కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొనతాలపల్లికి చెందిన 55 సంవత్సరాల మార్తమ్మ అనే మహిళ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడింది. చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా మారింది. కరోనా పరీక్ష ఫలితం రాకముందే... వైద్యులు చికిత్స చేశారు. చికిత్స చేస్తుండగానే మార్తమ్మ మృతి చెందింది.
అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు వెనుకడుగు వేశారు. కరోనా పరీక్ష ఫలితం వచ్చిన తర్వాతనే మృతదేహాన్ని తీసుకువెళ్తామని చెప్పి అక్కడే వదిలివెళ్లిపోయారు. ఫలితంగా... ఆ మహిళ మృతదేహం ఆస్పత్రిలో మంచంపైనే ఉంది. అనంతరం.. మార్తమ్మకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. చివరికి ఆసుపత్రి సిబ్బందే మార్తమ్మ మృతదేహం తరలించే ఏర్పాట్లు చేశారు.