కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఓ భవనం వద్ద పనిచేస్తున్న లక్ష్మీ అనే మహిళను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తన ఆఖరి కోరికగా తన పిల్లలను కలిసి జాగ్రత్తలు చెప్పి తుది శ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ను గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు.
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని మహిళ దుర్మరణం - news updates in krishna district
కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్న ఆ ఇల్లాలిని మృత్యువు వెంటాడింది. తన పిల్లల్ని సంతోషంగా ఉంచాలనుకున్న ఆ తల్లిని మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి... తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పి కన్నుమూసింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కేసరపల్లి జాతీయ రహదారిపై జరిగింది.
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని మహిళ దుర్మరణం