ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలో దూకిన మహిళ.. కారణం అదేనా.. - ఆనారోగ్య కారణంతో మహిళ ఆత్మహత్య

Woman Jumping Into Canal: కృష్ణాజిల్లా గుడివాడలోని పెద్ద కాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె అచూకీ కోసం మొదట గాజఈతగాళ్లు వెతకగా ఫలితం దక్కలేదు. తరవాత పదిగంటలు శ్రమించి ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు మృతదేహాన్ని బయటకు తీశాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 17, 2022, 4:26 PM IST

Woman Committed To Suicide: కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు 10గంటల పాటు శ్రమించి మృతదేహన్ని బయటకు తీశాయి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడ మందపాడుకు చెందిన తాడి మమత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మానసికంగా కుంగిపోయిన మమత శుక్రవారం పెద్ద కాలువ దగ్గరికి చేరుకుని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి కాలువలో దూకింది. విషయం తెలిసిన కుటుంబసభ్యులు గాజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్నారు. గాజ ఈతగాళ్లు నీటిలో దూకి వెతకగా వారికి నిరాశే ఎదురైంది. అనంతరం ఎన్డీఆర్​ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన బృందాలు పది గంటలు శ్రమించి బాపూజీ నగర్ వద్ద కాలువలో మృతదేహాన్ని గుర్తించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details