కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను కలిసేందుకు పవన్ కల్యాణ్ రానుండటంతో అభిమానుల కోలాహలం నెలకొంది. పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావటంతో ఉప్పలూరు, పునాదిపాడుల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన...అభిమానుల సందడి - Pawan Kalyan updates
కృష్ణా జిల్లాలో నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను కలిసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం నెలకొంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
![కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన...అభిమానుల సందడి Pawan Kalyan's visit to Krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9734209-12-9734209-1606883979694.jpg)
కృష్ణా జిల్లాలో పవన్ రాకతో...అభిమానుల సందడి
జనసేన అధినేత గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని...అక్కడినుంచి కంకిపాడు మీదుగా ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తెనాలి వైపు పర్యటించనున్నారు.