చైనా నుంచి వచ్చిన 28 రోజుల్లోపు ఎవరికైనా.. జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వెంటనే మాస్క్ ధరించి.... దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. అత్యవసర సమాచారం కోసం..... 1100, 1102 టోల్ ఫ్రీ నంబర్లకు లేదా 7013387382, 8008473799 మొబైల్ నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొంది. విమానాశ్రయాలు, పోర్టుల్లో కరోనా వైరస్‌ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. జిల్లా స్థాయిలో ఏమైనా సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని వైద్యశాఖ సూచించింది. అన్ని బోధనా ఆసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కరోనాపై అప్రమత్తంగా ఉండండి.. వైద్య ఆరోగ్య శాఖ సూచన - with Health Department video confernence Coronavirus Review
కరోనా వైరస్‌పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని.... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. జిల్లాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
'కరోనా వైరస్‌పై జిల్లావైద్య ఆర్యోగ్యశాఖాధికారులు అప్రమత్తం'