కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటలో మద్యం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. పేటలోని అడ్డరోడ్డు వద్ద ఉన్న మద్యం షాపు వద్ద మాస్కులు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించారు. కరోనా వ్యాప్తిపై అంతా ఆందోళన చెందుతుంటే మద్యం ప్రియులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మద్యం షాపుల ముందు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మద్యం ఉంటే చాలు.. నిబంధనలు మాకెందుకు..! - జగ్గయ్యపేటలో మద్యం అమ్మకాల వార్తలు
దాదాపు నెలన్నర తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాల ముందు మందుబాబులు క్యూ కట్టారు. అయితే దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించినా పెడచెవిన పెట్టారు. తమకు మందుంటే చాలు.. కరోనా అయితే మాకేంటి అనే నిర్లక్ష్యంతో మద్యం ప్రియులు వ్యవహరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఓ దుకాణం వద్ద పరిస్థితి ఇది.
మద్యం ఉంటే చాలు.. నిబంధనలు మాకెందుకు..!