దాదాపు నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోగా.... భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు మద్యం దుకాణాల వద్ద షాపులు తెరవక ముందే జనాలు బారులు తీరారు. ప్రభుత్వ నిబంధనలు చాలా మంది ఏమాత్రం పాటించడం లేదు. మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టకుండా.. మద్యం దుకాణాలు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మద్యం దుకాణాల వద్ద... కిలోమీటర్ల మేర క్యూ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం కోసం వందల సంఖ్యలో మందు బాబులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. సామాజిక దూరం పాటించకుండా... కనీసం మాస్కులు ధరించకుండా వరుసలో నిలుచుంటున్నారు.
wine shops open