దాదాపు నెలన్నర తరువాత రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుకాణాల వద్ద మందు బాబులు బారులు తీరారు. రెండో రోజు ప్రభుత్వం మరింతగా రేట్లు పెంచి అమ్మకాలు మొదలు పెట్టింది.
కానీ.. కృష్ణా జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మధ్యాహ్నం 12 దాటినా దుకాణాలు తెరుచుకోకపోవడంపై మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో అమ్మకాలు ఉంటాయని సిబ్బంది వారికి నచ్చజెపుతున్నారు.