కృష్ణా జిల్లా.. చల్లపల్లిలో మద్యం షాపులు ఎంతకీ తెరవకపోయేసరికి మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వచ్చి లైన్ లో ఉన్నామని ఎండలో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే మద్యం షాపులు ప్రారంభించి మద్యం అమ్మకాలు చేస్తుంటే చల్లపల్లిలో మాత్రం అమ్మడం లేదని ఆవేదన చెందుతున్నారు. కోవిడ్ 19 నిబంధనలు అనుసరించకుండా గుంపులు గుంపులుగా క్యూలైన్ లో నిలబడ్డారు. మరి కొన్ని ప్రాంతాల్లో... కొనుగోలు చేసిన మద్యాన్ని దుకాణానికి దగ్గర్లోనే తాగి ఊగుతున్నారు. ఈ కారణంగా.. రోడ్డుపై వెళ్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
దుకాణాల వద్దే తాగుతున్న మందుబాబులు - కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలు
లాక్ డౌన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మూసివున్న మద్యం షాపులు ఈరోజు తెరచుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో అమ్మకాలు ప్రారంభం కాలేదు.
wine-shops-