కృష్ణా జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి రూ. 2.50 లక్షల విలువ గల 360 మద్యం సీసాలు, 2 మానిటర్లను దొంగలించారు. షాపు నిర్వాహకుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ... రూ. 2.50 లక్షల సరకు అపహరణ - chakkapalli latest news
చక్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి చోరీ చేశారు. ఘటనా స్థలాన్ని సీఐ రామచంద్ర రావు పరిశీలించారు. షాపు నిర్వహకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చక్కపల్లి మద్యం దుకాణంలో చోరీ