కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 110 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులు... ఆటో ఇంజన్ కింద భాగంలో రేకును తొలగించి అందులో మద్యం సీసాలు ఉంచి తరలిస్తున్నారు. గుర్తించిన పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
చిల్లకల్లులో అక్రమ మద్యం పట్టివేత - కృష్ణా జిల్లా క్రైం
కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఆటో ఇంజిన్ కింది భాగంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిల్లకల్లులో అక్రమ మద్యం పట్టివేత