ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం కోసం మండలాలు దాటి వస్తున్నారు! - మోపిదేవీ మద్యం షాపు న్యూస్

కరోనా వలన మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగటంతో ఆయా ప్రాంతాల్లో మందు షాపులు బంద్ అవ్వటంతో... మద్యం ప్రియులు అల్లాడుతున్నారు. కష్టమైనా సరే మండలాలు దాటి వెళ్లి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు.

wine lovers struggles
మద్యం కోసం మండలాలు దాటి వస్తున్నారు!

By

Published : Jul 22, 2020, 11:52 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి ఇతర మండలాల నుంచి మద్యం ప్రియులు తరలి వస్తున్నారు. అవనిగడ్డ, కోడూరు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు కావటంతో... ఆయా ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. దీంతో ఆ ప్రాంతాల మందుబాబులు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి గ్రామానికి తరలివస్తున్నారు. వందలాది మంది మద్యం దుకాణం ముందు బారులు తీరుతున్నారు. వీరిలో కొందరు మాస్కులు సైతం ధరించకుండా... భౌతిక దూరం పాటించకపోవటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు కంటైన్​మెంట్ జోన్ల నుంచి వస్తుండటంతో... స్థానికులు అభ్యంతరం చెప్పగా వారితో సైతం వాగ్వాదానికి దిగుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details