ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య మౌన దీక్ష.. పిల్లలతో సహా.. - krishna district latest news

భర్త తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరుతూ ఓ యువతి అత్తగారింటి ముందు మౌన పోరాటానికి దిగింది. తనను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని.. పెళ్లైన నాటి నుంచి భర్త ఇబ్బందులకు గురిచేశాడని సదరు యువతి వాపోయింది.

wife protest at husband house
wife protest at husband house

By

Published : Jan 27, 2022, 5:18 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో భర్త ఇంటి ముందు.. ఓ భార్య మౌన పోరాటానికి దిగింది. మణికంఠ అనే యువకుడు.. వైష్ణవి అనే యువతిని నవంబర్ 5, 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి యువకుడు వైష్ణవిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోబోయిన యువతి వైష్ణవిని బంధువులు రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. వివాహం తరువాత కవలు పుట్టాక భార్యను విడిచి వెళ్లిపోయాడు.

ఇద్దరు పిల్లలతో భర్త ఇంటికి వెళ్లిన వైష్ణవిని మణికంఠ కుటుంబీకులు.. ఇంటి నుంచి బయటకు తోసేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు యువతి, తన ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సదరు యువతి నుంచి వివరాలు సేకరించారు. దీనిపై వారు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details