ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంత్యక్రియలకు రాని తండ్రి... ఆఖరి క్రతువు నిర్వహించిన భార్య - machileepatnam crime

అనారోగ్యంతో కన్నకొడుకు చనిపోతే తనకు సంబంధం లేదని వెళ్లిపోయాడు ఓ తండ్రి. ఫలితంగా చేసేదేమీ లేక మృతుని భార్య నాగమణి అంతిమసంస్కారాలు పూర్తి చేసింది. ఈ విషాద ఘటన మచిలీపట్నం మాచవరంలో జరిగింది.

wife conducted her husband funerals in  machileepatnam
అంత్యక్రియలకు రాని తండ్రి... ఆఖరి క్రతువు నిర్వహించిన భార్య

By

Published : Jun 6, 2021, 10:59 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరం రెండో డివిజన్​లో ప్రసాద్, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో... స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందాడు. ఈ ఘటన గురించి మృతుని భార్య నాగమణి... ప్రసాద్ తండ్రికి సమాచారం అందించారు. అంత్యక్రియలకు రావాలని కోరారు. దానికి ఆయన నిరాకరించడంతో చేసేదేమీ లేక మృతుని భార్య నాగమణి అంతిమసంస్కారాలు పూర్తి చేసింది.

అంత్యక్రియలకు రాని తండ్రి... ఆఖరి క్రతువు నిర్వహించిన భార్య

ABOUT THE AUTHOR

...view details