మరికొద్ది గంటల్లో ఇంటికి చేరాల్సిన ఆ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విజయవాడలో జరిగిన కొవిడ్ ఆస్పత్రి ఘటనలో జగయ్యపేటకు చెందిన ఎస్. అబ్రహంతో పాటు ఆయన భార్య అగ్నికి ఆహుతి అయిపోయారు. నిజానికి అబ్రహం కరోనా నుంచి కోలుకోవడమే గాక...శనివారమే డిశ్చార్జ్ అయ్యారు. కానీ భార్య రాజకుమారితో కలిసి వెళ్లొచ్చని ఆస్పత్రిలోనే ఉండిపోయారు. ఈలోగా ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. అర్ధరాత్రి విజయవాడ రోడ్డులో జరిగిన అంత్యక్రియలకు నాయకులు, స్థానికులు, బేతస్థ ప్రార్థన మందిరం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అతను కోలుకున్నాడు..కలిసి వెళ్దామనుకున్నారు....అంతలోనే! - కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
విజయవాడలో జరిగిన కొవిడ్ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో జగయ్యపేటకు చెందిన ఎస్. అబ్రహంతో పాటు ఆయన భార్య అగ్నికి ఆహుతి అయ్యారు. విజయవాడ రోడ్డులో జరిగిన అంత్యక్రియలకు స్థానికులతో పాటు బేతస్థ ప్రార్థన మందిరం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Vijayawada Fire Accident