రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగర శివారు పాయికాపురం, ఎల్బిఎస్ నగర్ లోని వీధులు వర్షపు నీటితో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని సుమారు 50 ఇళ్లు మోకాలు లోతు నీటిలో మునగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌతున్నారు. మరో పక్క ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎక్కడ కూలిపోతాయో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రతి ఏటా అధికారులు వర్షపు నీటిని మోటార్లతో తోడిస్తారని, కానీ శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
విస్తారంగా వర్షాలు-నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగర శివారు పాయికాపురం, ఎల్బిఎస్ నగర్ లోని వీధులు వర్షపు నీటితో మునిగిపోయాయి.
విజయవాడలో విస్తారంగా వర్షాలు-నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు