సీబిఐ కావాలి అన్న వైకాపా నాయకులు ఇప్పుడెందుకు భయపడుతున్నారో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడెందుకు వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏంటని నిలదీశారు. కోడికత్తి వెనుక మహాకుట్ర ఉందని, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గుంపు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేసులో ఉన్న నిందితులకు జైల్లోనే ప్రాణహాని ఉందనే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.
సీబీఐ అంటే వైకాపా ఎందుకు భయపడుతుంది? - vijayawada
కావాలి సీబీఐ..రావాలి సీబీఐ.. అన్న వైకాపా నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.
సీబీఐ అంటే వైకాపా ఎందుకు భయపడుతుందో చేప్పాలని డిమాండ్ చేసిన నారా లోకేష్