తెదేపా నేతల ఫోన్ సంభాషణల వివరాలు వైకాపాకు చేరుతున్నాయని గ్రహించే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంపై ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. చంద్రబాబు లేఖపై వైకాపా నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గతంలో అనేక లేఖలు రాస్తే, వాటిపై ఏనాడూ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
14 నెలలుగా పోలీస్ శాఖలోని కొందరు అత్యుత్సాహపరులు, రాజకీయ అండదండలున్నవారు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతి చేశారన్న ఆధారాలు లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ముగ్గురు వైకాపా నేతల కబంధహస్తాల్లో రాజ్యాంగ వ్యవస్థలున్నాయని అన్నారు.