అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు 250 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. రాజధాని పోరాటం ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా సాగుతుందన్నారు.
'అమరావతి మహిళలపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష?' - amaravati capital news
అమరావతి కోసం ఆందోళన చేస్తున్న మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఆందోళనకారుల ఆవేదన వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
అమరావతి కోసం ఆందోళన చేస్తున్న మహిళలపై ఎందుకింత కక్షతో వ్యవహరిస్తున్నారు. వారిని లాఠీలతో కొట్టించడం, బూటు కాళ్లతో తన్నడం ఎటువంటి న్యాయమో, ధర్మమో పాలకులు సమాధానం చెప్పాలి. భావితరాల భవిష్యత్ కోసం భూములు త్యాగం చేసిన వారిపై ఇనుపపాదం మోపుతారా?. ఆందోళనకారుల ఆవేదన వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజధాని కోసం పోరాడుతున్న వారు ఎప్పటికీ ఒంటరివారు కాదు. వారికి 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తల మద్ధతు, చంద్రబాబు ఆశీస్సులుంటాయి - వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూర్ సభ్యుడు