ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇచ్చే పుస్తకాలపై సీఎం ఫొటోలు వేసుకున్నారని తెదేపా దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పుస్తకాలు ఎలా ముద్రించారని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి... పిల్లల పుస్తకాలపై ఫొటోలు వేసుకునే ధైర్యం చేయలేదని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి పుస్తకాలు ముద్రించారని దుయ్యబట్టారు. ఈ పుస్తకాలు ఇప్పటికే మండల కార్యాలయాలకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా చిన్న పిల్లల పుస్తకాలపై సీఎం ఫొటో వేయమని ఏ అధికారులు ఆదేశాలిచ్చారు. ఎన్నో కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఫొటోను విద్యార్థుల పుస్తకాలపై ఎలా వేస్తారు?.. ఇది హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం కాదా?... ఇది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం కాదా?. దీనిపై సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఉన్నత న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం- దేవినేని ఉమ