ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నూతన రాజధాని కావాలని ఎవరు అడిగారు?'

నూతన రాజధాని కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు అడిగారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ప్రశ్నించారు. మూడు రాజధానుల అవసరం ఏముందని నిలదీశారు. రైతులు తలపెట్టిన చలో అమరావతిని విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు.

tdp leader konakalla narayana rao
tdp leader konakalla narayana rao

By

Published : Dec 14, 2020, 4:44 PM IST

రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ ఈ నెల 17వ తేదీన తలపెట్టిన చలో అమరావతిని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారయణరావు ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తెదేపా కార్యాలయంలో ఆయన, పార్టీ మహిళ అధ్యక్షురాలు స్వర్ణలత మీడియాతో మాట్లాడారు. నూతన రాజధాని కావాలని ప్రభుత్వాన్ని ఎవరు అడిగారని కొనకళ్ల ప్రశ్నించారు. తెదేపా హయాంలో నిర్మించిన భవనాల నుంచే ప్రస్తుత పాలన కొనసాగుతుందన్న ఆయన... మూడు రాజధానులు అవసరం ఏంటని నిలదీశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొనకళ్ల కోరారు.

మరోవైపు పన్నుల రూపంలో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని స్వర్ణలత విమర్శించారు. అబలల ఉసురు వైకాపాకు తగులుతుందని వ్యాఖ్యానించారు. సర్కార్ వైఖరిని నిలదీసేందుకు సంఘటిత పోరాటం చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details