గ్రామ సచివాలయాలకు తెలుపు రంగు ! - గ్రామ సచివాలయాలకు తెలుపు రంగు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పలు గ్రామాల్లో.. గ్రామ సచివాలయాలకు వైకాపా పార్టీ రంగు తొలగించి తెలపు రంగు వేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
గ్రామ సచివాలయాలకు తెలుపు రంగు !
గ్రామ సచివాలయాలకు వైకాపా రంగు తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. పాత రంగులను తొలగిస్తూ.. ప్రభుత్వ భవనాలకు తెలుపురంగును వేస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని చల్లపల్లి, పెదకల్లెపల్లి, వెంకటాపురం, రావి వారిపాలెం, కోడూరు, లక్ష్మీపురం గ్రామ సచివాలయాలకు తెలుపు రంగును వేశారు.