బడ్జెట్‌పై ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని తెదేపా శాసనసభా పక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. రాజకీయ సభలకిచ్చే ప్రాధాన్యం అసెంబ్లీ సమావేశాలకు లేదా అని నిలదీశారు. ఆర్డినెన్స్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆక్షేపించారు. అత్యవసర సమయాల్లో వాడే.. ఆర్డినెన్స్ సాధారణ పరిస్థితుల్లో ఉపయోగించడం ఏమిటని బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు.
'బడ్జెట్‌పై ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది' - వైకాపా ప్రభుత్వంపై డోలా వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు
ఆర్డినెన్స్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని తెదేపా శాసనసభా పక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. బడ్జెట్‌పై ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు.

whip dola bala veeranjaneya swamy on budget ordinance
మూడు రాజధానుల బిల్లు నుంచి అన్నింటికీ ఆర్డినెన్స్‌నే వాడుకుంటున్నారని బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అడ్డగోలు నిర్ణయాలు, అసంపూర్ణ బడ్జెట్ తో రాష్ట్ర భవిష్యత్తు అధోగతిగా ఉందని అన్నారు.
ఇదీ చదవండి: గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం..!