ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరిట ఉన్న ఓ జీ మెయిల్ ఖాతా నుంచి హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విధంగా ఉందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖకు లేఖ ఎవరు రాశారన్న అంశం తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి, కుట్ర వెనుక ఎవరున్నారనేది బయటపెడతామని అన్నారు. కొందరు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖలో రాసిన విషయాన్ని ఎన్నికల కమిషనరే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
'లేఖలో ఏం రాశారో కమిషనరే చెప్పాలి': జోగి రమేష్ - sec ramesh kumar
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. కావాలనే అధికార పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
'లేఖలో ఏం రాసారో కమిషనరే చెప్పాలి': వైకాపా నేత జోగి రమేష్