కొవిడ్-19 వ్యాప్తితో ప్రజలంతా అప్రమత్తమయ్యారు. ఎక్కడికి వెళ్లినా మాస్కు ధరిస్తున్నారు. వైరస్ ప్రభావం పిల్లల్లో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు మాస్కులు ధరిస్తే ఇబ్బందులేవైనా తలెత్తుతాయేమోనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి నుంచి విముక్తి పొందాలంటే పిల్లలు కూడా మాస్కులు ధరించడం తప్పనిసరని నిపుణులు అంటున్నారు. మరి.. పిల్లలకు ఎలాంటి మాస్కులు వాడాలంటే..
పిల్లలు ఎలాంటి మాస్కులు ధరించాలంటే.. - cotton masks for kids
కరోనా వల్ల మాస్కుల వాడకం రోజువారీ జీవితంలో భాగమైంది. కానీ ఎలాంటి మాస్కులు వాడాలో మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాం. కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే పిల్లలు మాస్కులు ధరించవచ్చా? ఎలాంటి మాస్కులు ధరించాలో సందేహాలుంటే ఈ కథనం చదివేయండి.
పిల్లల మాస్కులు
వీలైనంత వరకు కాటన్ మాస్కులను వాడండి. అయిదేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలకి మాస్కులు బదులు ఫేస్ షీల్డ్‌లను ఉపయోగించడం మంచిది. కొత్త మాస్కులను ఉతికిన తర్వాతే వేయాలి. కాటన్ మాస్కులను రోజూ శుభ్రపరచాలి. అలాగే సువాసన వచ్చే సహజసిద్ధమైన ఎసెన్షియల్ ఆయిల్‌ని మాస్కులకు రాస్తే పిల్లలకు చిరాకుగా అనిపించదు.
ఇదీ చదవండీ...బిహార్ తర్వాతి సీఎం ఆయనే: అమిత్‌షా