ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bonda Uma: బీసీల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం ఏం చేసింది..?: బోండా ఉమ - వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలు

వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం వైకాపా ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పే సత్తా ఆ పార్చీ నాయకులకు ఉందా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ నూతన కమిటీని ఆయన ప్రకటించారు.

Bonda Uma On BCs
బోండా ఉమ

By

Published : Sep 1, 2021, 5:07 PM IST

తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ నూతన కమిటీని ఆ పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ..వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం వైకాపా ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పే సత్తా ఆ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో బీసీలకు స్వర్ణయుగంలా ఉంటే..వైకాపా అధికారంలోకి వచ్చాక వారి జీవన స్థితిగతులు పాతాళంలోకి వెళ్లిపోయాయన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక బ్యాక్ లెస్ బోన్​గా బీసీలను అణగదొక్కే యత్నం చేస్తున్నారన్నారు. పేదలందరికీ ఇచ్చే పథకాలను కేవలం బీసీలకే ఇస్తున్నామని వైకాపా నాయకులు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. బీసీల హక్కుల కోసం.. సబ్ ప్లాన్ నిధుల కోసం తెదేపా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: ALAPATI: టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేవరకు తెదేపా పోరాటం: ఆలపాటి రాజా

ABOUT THE AUTHOR

...view details