సంప్రదాయాలపైనా కరోనా ప్రభావం చూపుతోంది. పెళ్లి విందు భోజనాలను పార్సిళ్లల్లో అందించేలా చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ కాలేషా తన కుమార్తెను విజయవాడ యువకుడికి ఇచ్చి మార్చిలో వివాహం చేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ కారణంగా వేడుకను వాయిదా వేశారు.
కరోనా మాయ: పెళ్లికొస్తే పార్సిల్ విందు - లాక్ డౌన్లో పెళ్లిళ్లు
కరోనా పుణ్యమా అంటూ... కృష్ణా జిల్లాలో పెళ్లిలో భోజనాల స్టైలే మారిపోంది. గౌరవంగా ఆకేసి... ఆప్యాయంగా భోజనం వడ్డించే పద్ధతి మారి... పార్సిళ్ల సంస్కృతి వచ్చేసింది.
![కరోనా మాయ: పెళ్లికొస్తే పార్సిల్ విందు meals parcel to relatives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7428528-694-7428528-1590996211854.jpg)
బంధువులకు పార్సిళ్ల పంపిణీ
ప్రస్తుతం లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించడంతో నిబంధనలకు అనుగుణంగా వివాహం చేద్దామని వధువు తల్లిదండ్రులు భావించారు. ఈ విషయాన్ని వరుడి తరఫు పెద్దలకు తెలపడంతో వారూ అంగీకరించారు. 20 మంది ఆత్మీయులకే ఆహ్వానాలు పంపి, ఆదివారం కొండపల్లిలో వివాహాన్ని నిరాడంబరంగా జరిపించారు. భోజనాన్ని డబ్బాల్లో పార్సిళ్లు చేసి, బంధువులకు అందించారు.
ఇదీ చదవండి: కేజీహెచ్‌లో ప్రతీ పడకకు ఆక్సిజన్ సదుపాయం