ఒడిశా తీరాన్ని అనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమైంది. ప్రస్తుతం బాలాసోర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ ఈ మధ్యాహ్నానికి పశ్చిమ బంగా, ఒడిశా మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బంగా, ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో..కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా మారటంతో తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాతో పాటు.. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.
ఒడిశావైపు వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు - rains
బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రమైంది. బాలాసోర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ మధ్యాహ్నాం బంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, బంగాల్, ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి.
weather-report