విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ముగియనున్నందున.. ఎస్సీలు, గిరిజనులతో కలిసి తిరుమలేశుడి దర్శనానికి ఉత్తర పీఠాధిపతులు పయనమయ్యారు. విజయవాడలోని యాత్రీకులతో కలిసి ఆయన సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
హిందూ అంటే మతం కాదు..
హిందూ ధర్మం అంటే భారతీయ జీవన విధానానికి సంకేతమని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలదని, ధర్మాన్ని అనుసరిస్తేనే భగవత్ సాక్షాత్కారం అందుతుందన్నారు.