ప్రభుత్వంపై తెదేపా విషప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం(sajjala comments on chandrababu news ) చేశారు. ఎక్కడ ఏం జరిగినా సీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ అంశంపై సీబీఐ, డీఆర్ఐ విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు.
Sajjala: చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు: సజ్జల
18:19 October 05
we will take legal action against chandrababu - sajjala
వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 2.5 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామని సజ్జల వెల్లడించారు. ఆధారాలు లేకుండా తెదేపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాండోరా పత్రాల్లో(pandora papers news) జగన్ పేరు ఉండొచ్చన్న వ్యాఖ్యలు దారుణమన్నారు. చంద్రబాబు చేసిన ఈ ఆరోపణల(chandrababu allegations against cm jagan)పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
CHANDRABABU: 'వైకాపా నేతలు డ్రగ్స్ డాన్స్, స్మగ్లింగ్ కింగ్‌లుగా మారారు'