కరోనా కష్టకాలంలో అధిక బిల్లులతో బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తప్పవని.. మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ఈ సమయంలో మానవత్వంతో సేవ చేయాలని హితవు పలికారు. కృష్ణా జిల్లా గుడివాడలో.. కరోనా కట్టడి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఆసుపత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం: కొడాలి నాని
జిల్లాలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపై మంత్రి కొడాలి నాని ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. అధిక బిల్లులు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్, జేసీ సహా ఇత అధికారులు హాజరయ్యారు.
కొడాలి నాని